https://tamilpolitrics.com Mon, 02 Aug 2021 06:09:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.1.2 రైతుకు మరింత మెరుగ్గా వ్యవసాయ ఫలాలు అగ్రి బోర్డులతో సాధ్యం https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8/%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%be-%e0%b0%b5%e0%b1%8d/ https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8/%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%be-%e0%b0%b5%e0%b1%8d/#respond Sat, 31 Jul 2021 11:52:13 +0000 https://tamilpolitrics.com/?p=649 లక్ష మందికి పైగా రైతులు వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా ప్రభుత్వానికి వ్యవసాయాభివృద్ధిపై సలహాలు ఇస్తూ అభివృద్ధిలో బాగస్వాములవుతున్నారని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు . రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్లతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కన్నబాబు ఈ మండళ్ల గురించి మాట్లాడారు . నాలుగు అంచెలు గ్రామ , మండల , జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల సహకారంతో రాష్ట్ర వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు .
రైతుకు సముచిత గౌరవం ఇస్తూ రైతునే చైర్మన్ గా నియమించాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు . సీఎం ఆదేశాల మేరకు వ్యవసాయ మండళ్లను అన్ని వ్యవసాయ అంశాల్లోనూ భాగస్వాములను చేస్తున్నామని కన్నబాబు చెప్పారు. వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువుగా , మెరుగ్గా అందాలనే సదుద్దేశంతో సీఎం వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారని ఈ సందర్బముగా చెప్పుకొచ్చారు . సుమారు లక్ష మందికి పైగా అనుభవం వున్న రైతులు వ్యవసాయంపై ఈ మండళ్ల ద్వారా ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇస్తున్నారని చెప్పారు .
మండళ్ల సమావేశాలు క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు . ప్రతి సమావేశంలో అంశాలను రికార్డు చేయాలనీ , సంబంధిత వ్యవసాయ అధికారులు బాద్యతాయుతంగా ఉండాలని మంత్రి కోరారు .వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టుసాగు , చేపలు రొయ్యల పెంపకం, సహకార తదితర అన్ని అంశాల్లో మండళ్లు తమ సూచనలను అందిస్తే వాటిని సీఎం దృష్టికి తీసుకువచ్చి మరింత వ్యవసాయాభివృది చేయొచ్చన్నారు . దేశంలోని ఏ రాష్ట్రంలోని అమలు చేయని వ్యవసాయ, సంక్షేమ పథకాలను కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన సీయం జగన్ దిగ్విజయంగా అమలు చేస్తున్నారని చెప్పారు . సాగు చేసే ప్రతి పంట ఈ క్రాప్ లో రిజిస్టర్ చేయించాలని, ఇది రైతుతో పాటూ మనందరి ప్రధాన బాధ్యత, అందుకు తగిన సదుపాయాలను ఆర్బీకే ల్లో కల్పించామన్నారు . బోర్ల కింద వరి పండించకుండా రైతులకు అవగాహనా కల్పించాలని అయన కోరారు .ఈ క్రాప్ మరియు సీఎం అప్ లను మరింత సరళీకృతం చేసి రైతులకు సులువుగా ఉండేలా చేస్తామన్నారు. అనంతరం వ్యవసాయ సలహా మండళ్ల ఆవిర్భావం, ఉద్దేశ్యాలు, బాధ్యతలు తదితర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. పంటల ప్రణాళిక , డిమాండ్ మేరకు ఉత్పత్తి , పంటల మార్పు , రైతులకు ఆర్బీకే లో అందుతున్న సేవలు , మార్కెట్ ఇంటలిజెన్స్ , వాతావరణ పరిస్థితులు ,FPO ల సుస్థిరత తదితర అంశాలపై సలహాలు ఇస్తూ రైతుల్ని చైతన్య పరచాలని ఇతర వక్తలు మండళ్ల చైర్మన్లకు పలు సూచనలు చేశారు.
స్పెషల్ సెక్రెటరీ పూనమ్ మాలకొండయ్య , రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ నాగిరెడ్డి , కమిషనర్లు అరుణ్ కుమార్ , ప్రద్యుమ్న ,శ్రీధర్ , అహ్మద్ బాబు , కన్నబాబు, శేఖర్ బాబు , శ్రీకంఠనాథరెడ్డి ,
ఆగ్రోస్ ఎండి కృష్ణ మూర్తి , సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమరావు , పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ అమరేంద్ర , 13 జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు .

]]>
https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8/%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%be-%e0%b0%b5%e0%b1%8d/feed/ 0
మాతృభాష పరిరక్షణ కోసం సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాలి – ఉపరాష్ట్రపతి https://tamilpolitrics.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3/%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4%e0%b1%83%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%b8%e0%b1%83/ https://tamilpolitrics.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3/%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4%e0%b1%83%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%b8%e0%b1%83/#respond Sat, 31 Jul 2021 11:49:13 +0000 https://tamilpolitrics.com/?p=646 భాషను కాపాడాలని… ప్రభుత్వం అనుకుంటే నిధులు ఇవ్వగలదు, ప్రజలు అనుకుంటేనే తరతరాలు మనగలదు
• మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు సూత్రాలను పునరుద్ఘాటించిన ఉపరాష్ట్రపతి
• మాతృభాషను కోల్పోతే గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతాం
• మాతృభాషతో పాటు సోదర భాషలను అధ్యయనం చేయాలి
• భాషగా మాత్రమే మాతృభాషను నేర్చుకునే పరిస్థితికి స్వస్థి చెప్పాలి
• మాతృభాష పరిరక్షణ కోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల నుంచి స్ఫూర్తిని పొందాలి
• భారతీయ భాషల పరిరక్షణ దిశగా కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించిన ఉపరాష్ట్రపతి
• “తెలుగు కూటమి”భాషాభిమానుల అంతర్జాల సదస్సులో ప్రసగించిన ఉపరాష్ట్రపతి

మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో, అంతే వేగంగా ముందు తరాలు భాష వైపు ఆకర్షితమౌతాయని తెలిపారు. ప్రభుత్వాలు భాషను కాపాడాలని సంకల్పిస్తే నిధులు ఇవ్వగలదని, అదే సంకల్పం ప్రజలు తీసుకున్నప్పుడే తరతరాలకు మనగలదని దిశానిర్దేశం చేశారు.
“తెలుగు కూటమి” సంస్థ నిర్వహించిన భాషాభిమానుల అంతర్జాల సదస్సులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు సూత్రాలను పునరుద్ఘాటించారు. ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడం, పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించడం, క్రమంగా సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగం పెరగడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు.
ఇటీవల సుప్రీం కోర్టులో ఆంగ్లంలో తన సమస్యను చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న మహిళకు మాతృభాష అయిన తెలుగులో మాట్లాడే అవకాశం ఇచ్చి, 21 సంవత్సరాలుగా సాగుతున్న భార్యాభర్తల వివాదాన్ని సానుకూల మార్గంలో పరిష్కరించిన చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్.వి.రమణ గారి చొరవను ఉపరాష్ట్రపతి అభినందించారు. సరైన న్యాయం అందాలంటే ప్రజలు తమ సమస్యలను తమ మాతృభాషలో తెలియజేసే అవకాశాన్ని ఇవ్వాలని ఈ సందర్భం ద్వారా రుజువైందని తెలిపారు.
మాతృభాషను కోల్పోతే గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతామన్న ఉపరాష్ట్రపతి, మాతృభాషను కాపాడుకునే సంకల్పంతో వివిధ నేపథ్యాలకు చెందిన వారంతా తెలుగు కూటమి సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలన్న తన ఆకాంక్ష వెనుక ప్రధాన కారణం ఇదేనన్న ఆయన, ప్రభుత్వాలు తమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటాయని, అయితే ప్రజలంతా కలిసి తమ భాషను కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పుడు ముందు తరాలకు అందజేయడం సాధ్యమౌతుందని తెలిపారు. మన సాంస్కృతిక వైవిధ్యాలు, సంప్రదాయాలు, కళలు, సంగీతం, నాట్యం, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం లాంటి వాటిని మాతృభాషను కాపాడుకోవడం ద్వారానే పరిరక్షించుకోవచ్చన్న ఉపరాష్ట్రపతి, భాషంటే ఘనమైన వారసత్వమని తెలిపారు.
ఒక పటిష్టమైన భాషా విధానం ఉంటే ఏ భాషనైనా మనం కాపాడుకోవచ్చన్న యునెస్కో తీర్మానాన్ని ఉటంకించిన ఉపరాష్ట్రపతి, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన భాషా విధానాన్ని ప్రకటించడంతో పాటు, ఆచరించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నూతన విద్యావిధానంలో మాతృభాషకు పెద్దపీట వేసిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి, అభ్యాసంతో సంస్కృతి, భాష, సంప్రదాయాలను సమీకృతం చేసినప్పుడే పిల్లలు సమగ్రమైన పద్ధతిలో విద్యను అభ్యసించగలరని, నూతన విద్యా విధానం దీనికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఇటీవల నూతన విద్యాసంవత్సరం నుంచి ఎంపిక చేసిన శాఖల్లో పలు భారతీయ భాషల్లో కోర్సులు అందించాలని 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన ఆయన, వారికి అభినందనలు తెలిపారు.అంతరించిపోతున్న భాషల పరిరక్షణ మరియు ప్రోత్సాహ పథకం (SPPEL) ద్వారా మన మాతృభాషల పరిరక్షణ కోసం కేంద్ర విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలను సైతం ఉపరాష్ట్రపతి అభినందించారు.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు భాషాభిమానులు, భాషావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మీడియా మాతృభాష పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, మాతృభాష పరిరక్షణ కోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల నుంచి స్ఫూర్తిని పొందాలని స్పష్టం చేశారు. అన్ని శాస్త్రాలను వారి వారి భాషల్లో చదువుకుంటున్న ఫ్రాన్స్‌, జర్మనీ, స్వీడన్‌, రష్యా, జపాన్‌, చైనా, ఇటలీ, బ్రెజిల్‌ తదితర దేశాలు అభివృద్ధి చెందిన ఆంగ్లదేశాలతో పోటీ పడుతున్నాయన్న ఆయన, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమతమ మాతృభాషలు సంరక్షించుకునేందుకు అనుసరించిన విధానాలను కూలంకషంగా అధ్యయనం చేసి, మన మాతృభాషల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు.
ఏ భాషైనా విశ్వవ్యాపితం కావడానికి, పరిపుష్టి చెందడానికి అనువాదాలు ఎంతో అవసరమన్న ఉపరాష్ట్రపతి, ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి అనువాదం అవుతున్నంతంగా తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావడం లేదని, ఇందు కోసం తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రాచీన సాహిత్యాన్ని సరళ తెలుగులో యువతకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం కావాలన్న ఆయన, సాంకేతికంగా భాషా వినియోగం మరింత విస్తృతం కావాలని సూచించారు. వీటితో పాటు మారుమూల గ్రామాల నుంచి భాషాపదజాలాన్ని సమీకరించడం, అంతరిస్తున్న పదాలను వెలికి తీసి కాపాడుకోవడం, శాస్త్ర సాంకేతిక పారిభాషిక పదాలను తయారు చేయడం,వృత్తి పదకోశాలు, మాండలిక పదకోశాలు రూపొందించడం లాంటివిఆవశ్యకమని తెలిపారు.
తెలుగు భాషను కాపాడుకునే దిశగా తెలుగు కూటమి చేపట్టిన అనేక కార్యక్రమాలను అభినందించిన ఉపరాష్ట్రపతి,భాషగా మాత్రమే మాతృభాషలను నేర్చుకునే పరిస్థితి ఉండకూడదన్న తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అన్ని స్థాయిల్లో మాతృభాష వినియోగం మరింత పెరగాలన్న ఆయన,చిత్తశుద్ధి ఉంటేనే కార్యసిద్ధి జరుగుతుందని నొక్కిచెప్పారు. మాతృభాషలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని గట్టిగా చెప్పడం వెనుక తన ఉద్దేశం ఇతర భాషలను అశ్రద్ద చేయమని కాదని, యువతమాతృభాషతో పాటు, సోదర భాషలను కూడా అధ్యయనం చేయాలని, అదే సమయంలో మాతృభాష విషయంలో బలమైన పునాది కలిగి ఉండడం అత్యంత ఆవశ్యకమని సూచించారు.
భాషాభిమానం ఉండాలే గానీ దురాభిమానం తగదని.. ప్రతి ఊరిలోనూ రాజకీయాలకు అతీతంగా మాతృభాషను కాపాడుకునేందుకు తెలుగు కూటమి లాంటి బృందాలు ఏర్పడాలని, మన అమ్మ భాషను సజీవంగా ఉంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం కావాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ప్రజలు చైతన్యవంతమై ముందుకు వస్తే, ప్రభుత్వాలు కూడా భాషా పరిరక్షణకు మరింత ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉంటుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తే, ప్రజలు కూడా దాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీయ భాషలను ప్రోత్సహించాలనే సంకల్పమున్న ప్రధానమంత్రి, తెలుగుభాషాభివృద్ధిపై సానుకూలమైన ఆలోచన ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కారణంగా భాషావికాసానికి బాటలు పడుతున్నాయన్న ఉపరాష్ట్రపతి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ తమ ప్రాంతీయ భాషల అభివృద్ధికి కృషిచేయడం శుభపరిణామమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుశ్రీ కె. వి. రమణాచారి, విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారిశ్రీ నందివెలుగు ముక్తేశ్వర రావు, విశ్రాంత ఐ.పి.ఎస్. అధికారిశ్రీ చెన్నూరు ఆంజనేయరెడ్డి, తానా మాజీ చైర్మన్ శ్రీ తాళ్ళూరి జయశేఖర్, ద్రవిడ విశ్వవిద్యాలయ డీన్ శ్రీ పులికొండ సుబ్బాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ శ్రీ నందిని సిధారెడ్డి, భారత భాషాశాస్త్రవేత్తల సంఘం అధ్యక్షులుశ్రీ గారపాటి ఉమామహేశ్వర రావు, తెలుగు కూటమి అధ్యక్షులు శ్రీ పారుపల్లి కోదండరామయ్య సహా ప్రపంచంలోని పలు దేశాలకు దాదాపు వెయ్యిమంది తెలుగు భాషాభిమానులు, భాషావేత్తలు అంతర్జాలం ద్వారా హాజరయ్యారు.

]]>
https://tamilpolitrics.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3/%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4%e0%b1%83%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%b8%e0%b1%83/feed/ 0
ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా..? హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కూడా?! https://tamilpolitrics.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3/%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a6%e0%b0%be/ https://tamilpolitrics.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3/%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a6%e0%b0%be/#respond Sat, 31 Jul 2021 11:46:03 +0000 https://tamilpolitrics.com/?p=643 శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడే ఎన్నికలు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇంతకు ముందే ఓసారి వాయిదా పడిన ఈ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కూడా ఆలస్యం కావొచ్చని పేర్కొంటున్నాయి.
ఇప్పటికే ఓసారి వాయిదా
రాష్ట్రంలోని ఆరుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలితల పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 3వ తేదీనే ముగిసింది. వాస్తవానికి వారి పదవీకాలం ముగియ డానికి నెల ముందే ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కరోనా నేప థ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు మే 13న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తు తం వాటి నిర్వహణపై దృష్టిపెట్టిన ఈసీ రాష్ట్రంలో కరోనా స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలపాలంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దానికి సమాధానంగా ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలిసింది.
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కూడా ఆలస్యం?
రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌.. గత నెల 12న ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేశారు. ఈ మేరకు హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కూడా హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిబంధ నల ప్రకారం.. ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి 6 నెలల్లోగా ఉప ఎన్నిక జరగాలి. అంటే హుజూరా బాద్‌లో డిసెంబర్‌ 12 నాటికి ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాలి. ఇందుకోసం ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలలో ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరిస్థితులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై విముఖత వ్యక్తం చేయడంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

]]>
https://tamilpolitrics.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3/%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a6%e0%b0%be/feed/ 0
నెరవేరిన పెదవేమారెడ్డి కల https://tamilpolitrics.com/%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b0%be%e0%b0%a6%e0%b0%95%e0%b1%80%e0%b0%af%e0%b0%82/%e0%b0%a8%e0%b1%86%e0%b0%b0%e0%b0%b5%e0%b1%87%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b0%b5%e0%b1%87%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95/ https://tamilpolitrics.com/%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b0%be%e0%b0%a6%e0%b0%95%e0%b1%80%e0%b0%af%e0%b0%82/%e0%b0%a8%e0%b1%86%e0%b0%b0%e0%b0%b5%e0%b1%87%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b0%b5%e0%b1%87%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95/#respond Sat, 31 Jul 2021 11:39:08 +0000 https://tamilpolitrics.com/?p=640 చంద్రబాబును కలిసి మురిసిపోయిన 97ఏళ్ల వృద్ధుడు
రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ మీరే సిఎం కావాలని ఆకాంక్ష

ఆయన పేరు కట్టా పెదవేమారెడ్డి…గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెం గ్రామం….వయసు 97ఏళ్లు…సెంచరీకి చేరువలో ఉన్నారు…ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు పడిన తపన, నవ్యాంధ్రప్రదేశ్ లో రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పడిన శ్రమను గమనిస్తూ వచ్చిన ఆ పెద్దాయన తన జీవితకాలంలో ఒక్కసారైన చంద్రబాబును కలసి తన మనోగతాన్ని తెలియజేసి అభినందించాలని భావించారు… ఎన్నోమార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు…ఇటీవల పెదవేమారెడ్డి కోవిడ్ బారిన పడి అతికష్టం మీద కోలుకున్నారు…చంద్రబాబునాయుడు గారిని కలవాలన్న తన మనోభీష్టాన్ని కుటుంబసభ్యులు, సన్నిహితులకు తెలియజేయడంతో స్థానిక తెలుగుదేశం పార్టీనేతలు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు…ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబునాయుడు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ అమరావతిలోని తన నివాసానికి పిలిపించుకుని ఆప్యాయంగా మాట్లాడటంతో పెదవేమారెడ్డి మురిసిపోయారు…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ గత వైభవం సంతరించుకోవాలంటే మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన తన ఆకాంక్షను చంద్రబాబు ఎదుట వ్యక్తం చేశారు. జీవితకాలంలో ఒక్కమారైనా చంద్రబాబునాయుడును కలవాలన్న కల నెరవేరడంతో ఆ పెద్దాయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

]]>
https://tamilpolitrics.com/%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b0%be%e0%b0%a6%e0%b0%95%e0%b1%80%e0%b0%af%e0%b0%82/%e0%b0%a8%e0%b1%86%e0%b0%b0%e0%b0%b5%e0%b1%87%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b0%b5%e0%b1%87%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95/feed/ 0
బోర్డుల పరిధిలో కార్యాచరణకు సై – ప్రాజెక్టుల పరంగా విభిన్న అంశాలపై రెండు రాష్ట్రాలతో చర్చ https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8/%e0%b0%ac%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9a%e0%b0%b0/ https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8/%e0%b0%ac%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9a%e0%b0%b0/#respond Sat, 31 Jul 2021 11:35:30 +0000 https://tamilpolitrics.com/?p=637 3న గోదావరి బోర్డు సమన్వయ కమిటీ భేటీ
అదే బాటలో కృష్ణా బోర్డు సైతం
హైదరాబాద్‌: కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తెచ్చుకొనే ప్రక్రియకు బోర్డులు శ్రీకారం చుట్టాయి. నోటిఫికేషన్‌ అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి కార్యాచరణకు నడుం బిగించాయి. బోర్డు పరిధిలో ఉండే ప్రాజెక్టుల సిబ్బంది, కార్యాలయాలు, వాహనాలు, పరికరాలు మొదలైనవన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, ప్రాజెక్టుల వద్ద అవసరాన్ని బట్టి కేంద్ర పోలీసు బలగాలను నియమించడం, సీడ్‌ మనీ కింద ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల వంతున చెల్లించడం తదితర అంశాలన్నింటిపై రెండు రాష్ట్రాలతోనూ బోర్డులు చర్చించనున్నాయి. గతంలో బోర్డు కమిటీల్లో ఉన్నవారినే కాక జెన్‌కో, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖలోని పరిపాలనా విభాగం అధికారులను కూడా కలిపి ప్రత్యేకంగా సమన్వయ కమిటీని ఏర్పాటుచేశాయి. అనుభవమున్న ఓ చీఫ్‌ ఇంజినీర్‌ను, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ను సమన్వయం కోసం పంపాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులను కోరింది. గోదావరి బోర్డు ఒకడుగు ముందుకేసి ఆగస్టు మూడో తేదీన సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో బోర్డులోని అధికారులతో పాటు కేంద్ర జల్‌శక్తి అధికారి, రెండు రాష్ట్రాల నీటిపారుదల, పరిపాలనా విభాగాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో సీఎండీ, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీలను ఆహ్వానించారు.
బోర్డు ఆధీనంలో ఉండే ప్రాజెక్టులపై
కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రాజెక్టులను మూడు విభాగాలుగా విభజించారు. బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, బోర్డు ఆధీనంలో ఉండేవి, రాష్ట్రాల నిర్వహణలో ఉండి కేవలం పర్యవేక్షణ మాత్రమే బోర్డుకు ఉండేవి. ఇందులో బోర్డు ఆధీనంలో ఉండే ప్రాజెక్టుల గురించి ఆగస్టు మూడున జరిగే భేటీలో గోదావరి బోర్డు చర్చించనుంది. శ్రీరామసాగర్‌, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి, పంపుహౌస్‌, తుపాకులగూడెం, దేవాదుల, సీతారామ, పోలవరం, ధవళేశ్వరం, తాడిపూడి, పుష్కరం, చింతలపూడి, సీలేరు జలవిద్యుత్తు ప్రాజెక్టు మొదలైనవన్నీ గోదావరి బోర్డు పరిధిలో ఉన్నాయి. వాటి వద్ద సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను నియమించడం, ప్రాజెక్టులు, నిర్వహణకు సంబంధించి కోర్టుల్లో కేసులు వస్తే అందుకయ్యే వ్యయాన్ని రాష్ట్రాలే భరించడం, ప్రాజెక్టుల్లో మంజూరుచేసిన సిబ్బంది, పనిచేస్తున్న సిబ్బంది, యంత్రాలు, ఆఫీసు కార్యాలయాలు, ఫర్నిచర్‌, వాహనాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, రికార్డులు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు ఆరునెలల్లో అనుమతులు పొందడం, అనుమతులు రాని ప్రాజెక్టులను నిలిపివేయడం ఇలా అన్ని అంశాలను మూడో తేదీ సమావేశానికి అజెండాగా గోదావరి బోర్డు నిర్ణయించింది. కృష్ణాబోర్డు సైతం త్వరలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

]]>
https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8/%e0%b0%ac%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9a%e0%b0%b0/feed/ 0
90% బాలలు.. స్మార్ట్‌ బానిసలు! https://tamilpolitrics.com/%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af%e0%b0%82/90-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81/ https://tamilpolitrics.com/%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af%e0%b0%82/90-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81/#respond Sat, 31 Jul 2021 11:09:04 +0000 https://tamilpolitrics.com/?p=633 ఇటు ఆన్‌లైన్‌ తరగతులు.. అటు ఛాటింగ్‌సెల్‌ఫోన్‌ అతి వినియోగం.. ఆరోగ్యంపై దుష్ప్రభావం
స్క్రీన్‌ సమయం 2 గంటలు మించొద్దు
వెల్లడించిన ఎన్‌సీపీసీఆర్‌ అధ్యయనం

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ తరగతులంటూ చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్‌ స్క్రీన్‌ ముందు గడపటం వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు ఆ తరగతులు రెండు గంటల సమయానికి పరిమితం చేయాలని సూచించింది. కరోనాతో డిజిటల్‌ క్లాసులు ప్రారంభమైన క్రమంలో ప్రతి పది మంది పిల్లల్లో ఏకంగా తొమ్మిది మంది సెల్‌ఫోన్‌కు బానిస అవుతున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్‌ చదువులకు స్మార్ట్‌ఫోన్లే కీలకమని 94.8 శాతం మంది పిల్లలు అభిప్రాయపడుతుండటంతో తల్లిదండ్రులు వారికి వాటినిస్తున్నట్లుగా సర్వే తేల్చింది. పిల్లలు 13 ఏళ్ల వయసు నుంచి సొంతంగా ఫోన్లు కొంటున్నారని, 9-17 ఏళ్ల విద్యార్థుల్లో 30.2 శాతం మందికి ఇప్పటికే ఫోన్లు ఉన్నాయని అది పేర్కొంది. ‘మొబైల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ పరికరాల వినియోగం – పిల్లల్లో శారీరక, మానసిక, ఆలోచనలపై ప్రభావం’ పేరిట ఎన్‌సీపీసీఆర్‌ సర్వే చేసింది. దేశంలోని దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, భువనేశ్వర్‌, గువాహటి నగరాల్లోని 60 కార్పొరేట్‌, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లోని 9-17 ఏళ్ల విద్యార్థులపై రాంబావు మాల్గీ ప్రబోధిని సంస్థ(ఆర్‌ఎంపీ)తో కలిసి అధ్యయనం చేసింది. ఈ సర్వేలో 3491 మంది విద్యార్థులు, 1534 మంది తల్లిదండ్రులు, 786 మంది టీచర్లు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ కన్నా ప్రత్యక్ష తరగతులతో మెరుగైన విద్య అందుతుందన్న అభిప్రాయం వారందరిలో వ్యక్తమైంది.
ఇవీ సమస్యలు..
నిద్రపోడానికి ముందు ఫోన్లతో గడిపే పిల్లల్లో నిద్రలేమి, ఆందోళన, నీరసం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వేలో 23.80 శాతం మంది పిల్లలు నిద్రకు ముందు మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నట్లు తేలింది.
ఆన్‌లైన్‌ తరగతులపుడు మొబైల్‌ఫోన్లలో ఇతర సమాచారాన్ని వెదకడంతో చదువుపై ఏకాగ్రత, విషయ పరిజ్ఞానంలో చురుకుదనం తగ్గుతోందని 37.15 శాతం మంది పిల్లలు అంగీకరిస్తున్నారు. 13.90 శాతం మంది విద్యార్థులు నిరంతరం మొబైల్‌ స్క్రీన్‌ తనిఖీ చేస్తున్నట్లు వెల్లడైంది.
కరోనా ఉద్ధృతి ఉన్నప్పుడూ 32.70 శాతం మంది పిల్లలు ఫోన్లో చూసే కన్నా స్నేహితులను నేరుగా కలిసేందుకు బయటకు వెళ్తున్నారు.
ఇంటర్నెట్‌ వినియోగంతో సృజనాత్మక విజ్ఞానం పెరుగుతున్నట్లు 31.50 శాతం మంది పిల్లలు వెల్లడించగా, మరో 40.50 శాతం మంది అది పాక్షికంగా ఉందన్నారు.
టీవీలు, సినిమా తెరల స్థానంలో మొబైల్‌ ఫోన్లు వినోద పరికరాలుగా మారాయని 76.20 శాతం మంది తెలిపారు.
హైదరాబాద్‌లో పిల్లలపై సర్వే చేయగా 41.30 శాతం మందికి సామాజిక మాధ్యమాల్లో ఖాతాలున్నట్లు వెల్లడైంది.
ఇవీ సూచనలు
పిల్లలకు రోజుకి 2 గంటలకు మించి స్క్రీన్‌ టైమ్‌ ఉండరాదు. కౌమారదశలోని యువత తల్లిదండ్రుల పర్యవేక్షణలో కంప్యూటర్లు, ఫోన్లు తదితరాలను ఉపయోగించాలి. తల్లిదండ్రులు సైతం తమ టీవీ, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం తగ్గించాలి. పిల్లలతో మాట్లాడుతూ వారి సందేహాలు తీర్చాలి.
స్మార్ట్‌ఫోన్లలోని డిజిటల్‌ వెల్‌బీయింగ్‌, పేరెంటల్‌ కంట్రోల్‌ సహాయంతో వెబ్‌, యాప్‌లపై నియంత్రణతో పాటు తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షిస్తుండాలి.
కాలనీలు, బస్తీల్లో ఖాళీ స్థలాన్ని పిల్లల క్రీడామైదానంగా ఎంపిక చేసి ఆటలు ఆడుకునే అవకాశమివ్వాలి.
పిల్లలకు సైబర్‌క్రైమ్‌, మోసాలపై పాఠశాలల స్థాయిలో అవగాహన కల్పించాలి.

]]>
https://tamilpolitrics.com/%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af%e0%b0%82/90-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81/feed/ 0
సైనికుడా వందనం https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/%e0%b0%b8%e0%b1%88%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b0%be-%e0%b0%b5%e0%b0%82%e0%b0%a6%e0%b0%a8%e0%b0%82/ https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/%e0%b0%b8%e0%b1%88%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b0%be-%e0%b0%b5%e0%b0%82%e0%b0%a6%e0%b0%a8%e0%b0%82/#respond Sat, 31 Jul 2021 10:58:46 +0000 https://tamilpolitrics.com/?p=600
గోదావరి జిల్లాలో గోవిందాపురం లో రామారావు గారంటే తెలియని వాళ్ళు లేరు ..ఇంకా చెప్పాలంటే గోవింధాపురంలోనే కాదు మొత్తం గోదావరి జిల్లాలోనే ఆయన పేరు తెలియని వారు లేరు ..ఉపాధ్యాయుడిగా గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఊర్లలో కూడా ఎంతో మంది విద్యార్థులను భావి పౌరులుగా తీర్చి దిద్దటంలో ఆయన చేసిన కృషి వల్ల అక్కడి ప్రజలకు ఆయనంటే గౌరవం ..ఆ రోజు ఆయన రిటైర్మెంట్ రోజు ..స్కూల్ నుంచి ఆయన్ని ఇంటిదాకా సాగనంపడానికి ఊరు ,ఊరంతా కదిలి వచ్చింది ..రామారావు మాస్టారు గారు రిటైర్ అయ్యి వెళ్లిపోతున్నారు అన్న విషయం తెలిసినప్పటి నుంచి బడిలో పిల్లలు కన్నీరు మున్నీరు గా ఏడుస్తూనే వున్నారు ..రామారావు మాస్టారికి కూడా మనసులో ఒక పక్క ఆనందం ..మరో పక్క తెలియని బాధ రెండు ఒకేసారి కలిగాయి ..తన చేతుల మీదుగా ఎంతో మంది పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయటమే కాకుండా వారంతా జీవితంలో మంచి స్థానాల్లో స్థిరపడటంతో ఆనందం ఒక వైపు ..ఇన్నేళ్ల ఈ ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఇంటికి చేరుకుంటున్నందుకు దుఃఖం ఒకేసారి వచ్చాయి ఆయనకు
రామారావు గారికి ఒక అమ్మాయి ,ముగ్గురు కొడుకులు ..అమ్మాయికి గోదావరి జిల్లాలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసాడు ..ఇక ముగ్గురు కొడుకులకు కూడా దేశ భక్తి కలిసి వచ్చేలా దేశం కోసం స్వతంత్ర పోరాటం చేసిన పోరాట యోధుల పేర్లు పెట్టుకున్నారు ..పెద్దవాడికి సుభాష్ చంద్ర బోస్ అని ,రెండో వాడికి చంద్ర శేఖర్ ఆజాద్ అని మూడో వాడికి భరత్ అనే పేర్లు పెట్టుకున్నాడు ..పెద్ద వాడు సుభాష్ సివిల్స్ పరీక్ష పాస్ అయ్యి ఢిల్లీ లో ఐపీఎస్ ఆఫీసర్ కాగా ,రెండో వాడు చంద్ర శేఖర్ కూడా సివిల్స్ లో సెలెక్ట్ అయ్యి ఐఏఎస్ అధికారిగా ఢిల్లీ లోనే కొలువు సంపాదించుకున్నాడు ..అయితే రామారావు మాస్టారు గారి బాధంతా చిన్న వాడు భరత్ గురించే ..భరత్ చదువులో అన్నయ్యలతో పోటీ పడలేకపోగా వెనకపడిపోయాడు ..ఎలాగోలా డిగ్రీ అయితే చేతికి తెచ్చుకోగలిగాడు కానీ సరైన స్థానంలో స్థిరపడలేకపోయాడు భరత్ ..ఇప్పుడు రామారావు మాస్టారు గారి ఆలోచనంతా భరత్ గురించే ..ఇప్పుడు తాను కూడా రిటైర్ అయ్యాడు కాబట్టి ఈ రోజు భరత్ తో విషయం మాట్లాడి ఎలాగైనా వాడిని కూడా ఒక దారిలో పెట్టాలి అనుకుంటూ ఇంటికి చేరారు రామారావు గారు ..ఆఫీసు పనుల వల్ల తండ్రి రిటైర్మెంట్ కార్యక్రమానికి రాలేకపోతున్నామని ఇద్దరు కొడుకులు ముందే చెప్పారు ..కూతురు ,అల్లుడు మాత్రం వచ్చారు ..భరత్ కూడా గ్రామంలోనే ఉండటంతో స్కూల్ వరకు వచ్చి తండ్రి రిటైర్మెంట్ కార్యక్రమం అయ్యేదాకా ఉండి ఎదో పనుందంటూ అక్కకు , బావకు చెప్పి వెళ్ళిపోయాడు
సరే ఆలా ఆలోచిస్తూనే రామారావు మాస్టారు గారు ఇంటికి చేరుకున్నారు ..భార్య జానకమ్మ వాకిట్లోనే ఆయనకు ఎదురొచ్చి దిష్టి తీసి ఆయన్ని ఇంటిలోకి తీసుకెళ్లింది ..కానీ ఎందుకో ఆయన ముభావంగా ఉండటం గమనించి “ఎందుకలా వున్నారు ” భయంగా అంటూ ఆయన్నే అడిగేసింది .. రామారావు గారంటే బడి పిల్లలకే కాదు ఇంట్లో వాళ్ళకి ,ఊళ్లో వాళ్ళకి కూడా భయము ,గౌరవం
ఏదో ఆలోచిస్తున్న రామారావు గారు జానకమ్మ ప్రశ్నతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చారు ..”అదే ..మన భరత్ గురించి ఆలోచిస్తున్నా “..చెప్పారు
అక్కడే ఉన్న కూతురు కల్పించుకుని ” నాన్న గారూ..మీరేమనుకోనంటే ఒక మాట చెపుతాను ..మీరు ,అమ్మ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ..ఇటువంటి సమయంలో తమ్ముడు మీకు తోడుగా మీ దగ్గరే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం “..అంటూ ఇంకా ఏదో చెప్పబోయేలోపు అల్లుడు కల్పించుకుని “అవును మామగారు ..మీ అమ్మాయి చెప్పింది నిజం ..కావాలంటే భరత్ ఇక్కడే ఉండి నాతో పాటు మా పొలాలు చూసుకుంటూ ఉంటాడు “..అని చెప్పటంతో
రామారావు గారు కూతురి వంక చూసి ” లేదమ్మా ..నా చేతుల్తో ఎంతో మంది పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దాను ..వాడి కన్నా పెద్దవాళ్ళైనా అన్నయ్యలు కూడా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ..కానీ ఎందుకో భరత్ ను ప్రయోజకుడిని చేయలేకపోయానే అన్న భాధ నన్ను వెంటాడుతుంది ..ఇక ,నాకు అమ్మకు అంటావా ?భగవంతుడి దయ వలన ప్రస్తుతం ఏ లోటు లేదు ..నాకు వచ్చే పెన్షన్ తో హాయిగా బతికేస్తాం ..అందుకే అన్నయ్యలు ఇద్దరు రమ్మన్నా రానని చెప్పేశా ..దూరంగా ఉంటేనే విలువలు ,ఆపేక్షలు ఉంటాయమ్మా ..ఊళ్లో వాళ్ళందరూ మీ చిన్నబ్బాయి ఏమి చేస్తాడు ?అంటే సమాధానం చెప్పలేకపోతున్నానమ్మా ..వాడి గురించే నా ఆలోచన అంతా..” భారంగా అన్నారు
అప్పుడే గుమ్మం లో అడుగుపెట్టిన భరత్ ఈ సంబాషణ అంతా విన్నాడు ..అయినా ఏమి విననట్లే లోపలికి వచ్చాడు
లోపలి రావటంతోనే “భరత్ ..అన్న రామారావు గారి పిలుపుతో ఆగి ఏంటి నాన్నగారూ..అన్నట్లు చూసాడు
“భరత్..నీతో మాట్లాడాలి ..ఇలా దగ్గరికి రా “..తండ్రి పిలుపుతో మౌనంగా ఆయన దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకుని నిలబడ్డాడు భరత్
“చూడు భరత్ ..నా చేతుల్తో ఎంతో మంది పిల్లలను చదివించి ప్రయోజకుల్ని చేశాను ..మీ అన్నయ్యలు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ..అందుకే నీ గురుంచి కూడా మీ పెద్దన్నయ్య సుభాష్ తో మాట్లాడాను ..అక్కడే ఢిల్లీ లో నీకు ఏదన్నా చిన్న కొలువు చూడమని..అందుకని నువ్వు బయలుదేరి ఢిల్లీ వెళితే అన్నయ్య నీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తా అన్నాడు ..ఏమంటావు ?ప్రశ్నర్ధకంగా అడిగారు రామారావు గారు
భరత్ ది కొద్దిగా దుందుడుకు స్వభావం ..తండ్రి మాటలకూ ఎటువంటి సమాధానం చెపుతాడో అని తల్లి ,కూతురు భయపడ్డారు
కానీ భరత్ మాత్రం ప్రశాంతంగా “నాన్న గారూ ..మీరే కదా ఎప్పుడూ అంటుంటారు ..దేశం మనకేమిచ్చింది అని ఆలోచించేకన్నా ,దేశానికీ మనమేం ఇచ్చాం అని ఆలోచించాలి అని చెపుతారు కదా ..నేను కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను ..నాకు కొద్దిగా సమయం ఇవ్వండి ..నేను ఏ పని చేసిన మీరు గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తాను ..పొరపాటున కూడా మిమ్మల్ని తలదించుకునేలా చెయ్యను ..ఇక నా భవిష్యత్ గురించి అన్నయ్యలను ఇబ్బంది పెట్టటం నాకు ఇష్టం లేదు ..నా మనసుకు నచ్చిన పనే నేను చెయ్యగలను నాన్నగారు ..నేను ఈ రాత్రికే బయలుదేరి వెళ్తున్నా నాన్న గారు ..వెళ్లే ముందు నన్ను ఎక్కడికి అని అడగకండి ..ఎటువంటి ఆటంకాలు రాకుండా నన్ను దీవించి పంపండి ..త్వరలో మీరు గర్వంగా తల ఎత్తుకునేలా మంచి కొలువు సంపాదించుకుని మీ దగ్గరికి వస్తా “..అని చెప్పటంతో రామారావు గారితో పాటు అక్కడే ఉన్న జానకమ్మ ,అల్లుడు ,కూతురు కళ్ళలో కూడా కన్నీళ్లు తిరిగాయి ..నిన్నటి దాక పొలం గట్లంబడి ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరగా తిరిగిన భరత్ లో ఇంత మెచూరిటీ ఎప్పుడు వచ్చింది ?జీవితంపై ఇంత క్లారిటీ ఎప్పుడు వచ్చింది ?మాటల్లో ఎక్కడ గందరగోళం లేదు ..చాల ప్రశాంతంగా స్థిర నిశ్చయానికి వచ్చిన వాడిలా వున్నాయి భరత్ మాటలు ..రామారావు గారికే ఆశర్యం వేసింది
అయినా ఉబికి వస్తున్నా కన్నీటిని ఆపుకుంటూ “చూడు భరత్ ..నీ ఉద్యోగ ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ..అయితే నీ ప్రయత్నంలో ఏదైనా అవాంతరం వస్తే మారు ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేయ్ ..నీకు మేము ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు “..చెప్పారు రామారావు గారు
భరత్ కళ్ళ వెంబడి ఉబికి వస్తున్న కన్నీటిని ఎవరి కంట పడకుండా చూసుకుంటూ తల్లి తండ్రుల పాదాలకు నమస్కరించి అక్కడే ఉన్న అక్కా ,బావాలకు చెప్పి భుజాన బ్యాగ్ వేసుకుని బతుకు సమరానికి బయలుదేరాడు ఆ రాత్రికి పల్లె వదిలి పట్నానికి
రెండు రోజుల తర్వాత భరత్ నుంచి ఫోన్ వచ్చింది ..తనకు మంచి ఉద్యోగం వచ్చిందని .. ఉద్యోగ వివరాలు త్వరలో చెప్తానని ..అయితే ఉద్యోగంలో భాగంగా రిమోట్ ఏరియా అయిన మారుమూల ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఇంటర్నెట్ ,ఫోను సౌకర్యాలు వుండవు కాబట్టి వీలు చూసుకుని తానె ఫోన్ చేస్తాను ..అమ్మ ఆరోగ్యం జాగ్రత్త ..అంటూ రామారావు గారికి చెప్పటంతో సంతోషంతో ఆయనకు ఆనంద భాష్పలు రాలాయి
“సరే నాన్నా..ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో ..వీలు వెంబడి ఫోను చేస్తుండు ..అని కొడుక్కి జాగ్రత్తలు చెప్పిన రామారావు గారు మొట్టమొదటి సారిగా ఆలోచనలో పడ్డారు .. భరత్ విషయంలో తప్పు చేసానా ?అన్న ఫీలింగ్ వచ్చింది ..కూతురు చెప్పినట్లుగా భరత్ ను ఇక్కడే తమ దగ్గర ఉంచుకుని ఉంటే బాగుండేదేమో ?అనవసరంగా వాడ్ని ఉద్యోగం పేరుతొ దూరాలకు పంపించాను కదా ?ఇలా ఆలోచిస్తూ తెల్లవార్లూ కలత నిద్దుర పోయారు
మెల్లగా కాలం దొర్లిపోతుంది..భరత్ నుంచి ఎప్పుడో కానీ ఫోన్లు రావటం లేదు ..ఆ ఫోను చేసినప్పుడు కూడా చాల హడావుడిగా ఫోన్ మాట్లాడి అవతల నాకు అర్జెంట్ పనులు ఉన్నాయంటూ పెట్టేసేవాడు ..సరే వాడు చేసే ఉద్యోగం అటువంటిది కదా అని సరిపెట్టుకున్నారు రామారావు గారు
కొంతకాలానికి రామారావు గారింట్లో ఫోన్ మోగింది ..”హలో ఎవరూ ..”అడిగారు రామారావు గారు
“హలో ..నమస్కారమండి..రామారావు గారేనా మాట్లాడేది “..అటువైపునుంచి
“అవునండి ..నేను రామారావునే మాట్లాడుతున్నా ..మీరూ? అంటూ ప్రశ్నర్ధకంగా అడిగారు
“నమస్కారం రామారావు గారూ ..నా పేరు శర్మ ..నేను రాష్ట్రపతి భవన్ నుంచి మాట్లాడుతున్నాను ..భరత్ గారు మీ అబ్బాయే కదా ?..”
తన కొడుకును రాష్ట్రపతి భవన్ నుంచి అధికారి ఫోన్ చేసి గారు అని సంబోదించటంతో ఆశర్యపోయిన రామారావు గారు “అవునండీ భరత్ మా అబ్బాయే ..ఇంతకీ విషయమేంటో చెప్పగలరా ?మా అబ్బాయి వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా ?భయపడుతూ అడిగారు రామారావు గారు
“అయ్యో ..అటువంటిది ఏమీ లేదండి ..రాష్ట్రపతిగారు మిమ్మల్ని సకల లాంచనాలతో రాష్ట్రపతి భవన్ కు తీసుకురమ్మన్నారు ..మరి కాసేపట్లో అక్కడి జిల్లా కలెక్టర్ గారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఢిల్లీ వచ్చే విమానంలో ఎక్కిస్తారు ..ఇక్కడికి రాగానే మా అధికారులు మిమ్మల్ని రిసీవ్ చేసుకుని రాష్ట్రపతి భవన్ కు తీసుకు వస్తారు ..” రాష్ట్రపతి భవన్ నుంచి ప్రత్యేక అధికారి ఫోనులో చెపుతున్నారు
రామారావు గారికి అంతా అయోమయంగా వుంది ..”అసలేం జరిగిందండి ..మేము రాష్ట్రపతి భవన్ కు రావటం ఏమిటి ?అసలు మీరు ఫోన్ చేసింది నాకేనా ?లేకపోతె ఎవరో అనుకుని పొరబడి నాకు చేసారా ?
“రామారావు గారు ..మీకు అన్ని విషయాలు స్వయంగా రాష్ట్రపతి గారే చెపుతారు..మరి కాసేపట్లో అక్కడి కలెక్టర్ గారు మీ దగ్గరికి వస్తారు ..ఈ లోపు మీరు రెడీ అవ్వండి ..ఉంటాను సార్.. నమస్కారం సార్ ..అంటూ ఫోన్ పెట్టేసారు
ఆయన ఆలా ఫోన్ పెట్టాడో లేదో ఇంటిముందు కార్లు ఆగిన శబ్దం వినిపించింది ..బిళ్ళ బంట్రోతు హడావుడిగా ముందు వస్తే వెనుకే వచ్చిన కలెక్టర్ “నమస్కారం రామారావు గారూ ..మీ ఢిల్లీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి “అని ఇంకా ఎదో చెప్పబోతుండగా రామారావు గారు అడిగారు కలెక్టర్ ని “కలెక్టర్ గారూ ..మీరైనా చెపుతారా ?ఈ ఢిల్లీ ప్రయాణం ఏంటో ?
“సర్ ..నిజానికి నాకు కూడా పూర్తి వివరాలు తెలీవు ..రాష్ట్రపతి భవన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది .మిమ్మల్ని ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్ కు పంపించమని”.. బయలుదేరండి సర్ ..అని కలెక్టర్ అనటంతో చేసేదేమి లేక బయలుదేరారు రామారావు గారు ..బయలుదేరేముందు ఢిల్లీ లో ఉన్న కొడుకులకు విషయం చెప్పి ఢిల్లీ బయలుదేరి వస్తున్నామని చెప్పారు ..ఆశర్యంగా వాళ్ళు కూడా రాష్ట్రపతి భవన్ నుంచి తమకు కూడా ఫోన్ వచ్చిందని ..ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మిమ్మల్ని ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్ కు తీసుకు రమ్మన్నారని చెప్పటంతో ఈ సారి ఆశర్యపోవటం రామారావు గారి వంతు అయింది ..భరత్ కు ఫోన్ చేస్తుంటే ఎంతసేపటికి కలవక పోవటంతో అయిష్టంగానే వారితో ఢిల్లీ బయలుదేరారు రామారావు దంపతులు వెంట కూతురు ,అల్లుడిని తీసుకుని
ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో విమానం దిగగానే అక్కడ ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులుగా పనిచేస్తున్న ఇద్దరు కొడుకులు మరికొందరు సైనిక అధికారులతో సిద్ధంగా వున్నారు ..రామారావు దంపతులను చూడగానే సైనిక అధికారి ఒకరు వచ్చి సెల్యూట్ చేసి సాదరంగా వి ఐ పి కారులో కూర్చోపెట్టుకుని రాష్ట్రపతి భవన్ కు తీసుకెళ్లారు ..రామారావు గారికి అంతా కల లా వుంది ..ఎక్కడో మారుమూల పల్లెటూరిలో సామాన్య ఉపాధ్యాయుడినైన తనకు జీవితంలో కానీ వినీ ఎరుగని రాచమర్యాదలతో రాష్ట్రపతి భవన్ లో అడుగుపెట్టటం ఏంటి ?అంతా కల లా ఉంది ..అసలేం జరుగుతుంది ఇక్కడ ?ఎవరు సమాధానం చెప్పటం లేదేంటి ?
ఇలా ఆలోచిస్తుండగానే అధికారులు రాష్ట్రపతి భవన్లోని ఒక విశాలమైన గదిలోకి తీసుకెళ్లి “మీరు ఇక్కడ రిఫ్రెష్ అవ్వండి ..మరికొద్దిసేపటిలో మిమ్మల్ని రాష్ట్రపతి గారి వద్దకు తీసుకెళతాం “..అని వెళ్లిపోయారు
సరిగ్గా పదినిమిషాలు కాగానే రాష్ట్రపతి ప్రత్యేక అధికారి రామారావు దంపతుల వద్దకు వచ్చి “సార్ ..మిమ్మల్ని ఇప్పుడు రాష్ట్రపతి గారి వద్దకు తీసుకెళ్తున్నాం ..పదండి ..అని బయలుదేరదీశారు
అలా రాష్ట్రపతి భవన్ లోనే వున్నా విశాలమైన హాలులోకి తీసుకు వెళ్లారు ..అప్పటికే అక్కడ రాష్ట్రపతి ,కొందరు సైనికాధికారులతో సమావేశం అయి వున్నారు
రామారావు దంపతులను చూడగానే అక్కడ ఉన్న సైనికాధికారులందరూ లేచి నిలబడి సెల్యూట్ చేసారు ..రాష్ట్రపతి కూడా కుర్చీ లోనుంచి లేచి రామారావు దంపతులకు నమస్కరించి తన పక్కన ఉన్న కుర్చీల్లో కూర్చోపెట్టారు
రాష్ట్రపతి నెమ్మదిగా హిందీలో చెప్పటం మొదలు పెట్టారు ..పక్కన తెలుగు అనువాదకులు ఆయన చెపుతున్నది తెలుగులో చెపుతున్నారు
“రామారావు గారూ ..నమస్కారం ..భరత్ మీ బిడ్డ అయినందుకు మాతోపాటు యావత్తు దేశం గర్వపడుతుంది ..అందుకు ముందుగా భారత దేశం తరపున మీకు నమస్కారాలు ..అయితే నేను చెప్పేది మీరు కొంచం గుండె దిటవు చేసుకుని వినాలి ..మీ కుమారుడు దేశం కోసం వీర మరణం పొందాడు ..ఒక్కడు ..ఒక్కడంటే ఒక్కడు ముష్కరుల తూటాలకు ఎదురెల్లి బేస్ క్యాంపులో వున్న 2000 మంది సైనికులను కుటుంబాలతో సహా కాపాడాడు ..యుద్ధంలో అతను చూపిన అసమాన ధైర్య సాహసాలను చూసిన ,విన్న మా సైనిక అధికారుల ఛాతీలు గర్వంతో ఉప్పొంగాయి ..దేశం మనకేమి ఇచ్చింది అన్నది కాదు దేశానికీ మనమేమి ఇచ్చాము అన్నది దేశానికీ ఇచ్చి చూపించాడు మీ అబ్బాయి భరత్ ..నిజంగా మీరు భరత్ అని పేరు పెట్టినందుకు కన్నవారి ఋణం ,దేశ ఋణం తీర్చుకున్నాడు భరత్ ..జమ్మూ కాశ్మీర్ లోని మారు మూల కార్గిల్ ప్రాంతంలో శత్రువులతో వీరోచితంగా పోరాడి అసువులు బాసారు ..తీవ్ర గాయాలతో వున్నఅతన్ని దగ్గర్లోని మిలిటరీ హాస్పిటల్ చేర్పించినప్పుడు చెప్పిన ఆఖరి మాటలను మీ కోసం రికార్డు చేసాం ..దేశం గర్వంతో ఉప్పొంగిపోయే మాటలు చెప్పాడు ..మీరు కూడా వినండి ..అనటంతో అక్కడే ఉన్న సైనికాధికారి ఆడియో టేప్ ఆన్ చేసాడు
“ప్రియమైన నాన్న గారికి , అమ్మకు నమస్కారాలు ..నాన్న గారు మీరు ఎప్పుడూ అంటుండేవారు గుర్తుందా ?దేశం మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికేమి ఇచ్చాం అని ఆలోచించాలి అని ..అప్పుడే నాకు సైన్యంలో చేరాలని ఆలోచన వచ్చింది ..నేను మీ ఆశీర్వాదం తీసుకుని వచ్చి చేరింది సైన్యంలోనే నాన్న గారు ..సైన్యంలో చేరాక నాకు తెలిసి వచ్చింది ..దేశం కోసం ఇప్పటిదాకా నేను చేసింది ఏమీ లేదని ..కుటుంబాలను సైతం విడిచిపెట్టి ఎక్కడో బోర్డర్ లో మైనస్ చలిలో గజ గజ వణుకుతూ కావలి కాస్తున్న నా తోటి సైనికులను చూసిన తర్వాత అర్ధం అయ్యింది నాన్నగారూ ..నేను సరైన చోటికే వచ్చానని ..నేను ఇంటినుంచి బయలుదేరి వచ్చేటప్పుడే మీతో చెప్పాను నాకు ఆత్మసంతృప్తి కలిగించే పనే చేస్తానని ..దేశం కోసం పని చేస్తున్నానని ఫీలింగే నాకు గొప్ప ఆత్మ సంతృప్తి ఇచ్చింది నాన్నగారు ..ఇంకో విషయం నేను ఏ పని చేసినా మీరు గర్వంతో తల ఎత్తుకునే పనే చేస్తాను అని చెప్పాను కదా ..మీరు తలదించుకునే పని నేను ఎప్పటికి చెయ్యను నాన్నగారు ..తల దించుకోవద్దు ..మీరు తల ఎత్తుకుని గర్వంగా నా మాటలు వినండి నాన్నగారు ..ఇప్పుడు మన ఊళ్లో అందరికీ చెప్పండి నాన్నగారు ..కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి వీర మరణం పొందిన భరత్ ఎవరో కాదు ..నా కొడుకే ..అని గర్వంగా చెప్పండి .. ఒక్క నిమిషం నిశ్యబ్దం
“సార్ ..ఇప్పుడు నేను నా అధికారులతో మాట్లాడుతున్నా ..సార్ ..నా మరణం తర్వాత గోదావరి జిల్లాల్లో వున్న మా అమ్మగారిని ,నాన్న గారిని అధికార లాంఛనాలతో రాష్ట్రపతి భవన్ కు తీసుకురండి ..నా శవం చూసిన తర్వాత నా తల్లితండ్రుల కళ్ళలో చుక్క నీరు కారకుడదు ..రామారావు మాస్టారు గారు గర్వంతో తల ఎత్తుకునేలా ఏర్పాట్లు చేయండి ..రాష్ట్రపతి గారు దయచేసి నా చివరి కోరికను తీర్చండి ..మరు జన్మంటూ ఉంటే మళ్ళీ సైనికుడిగానే పుడతా ..దేశ మాత సేవ చేసుకుంటా ..జై హింద్
మాటలు ఆగిపోయాయి .. హాల్లో సూది పడితే వినిపించేంత నిశ్యబ్దం
రామారావు మాస్టారి దంపతుల కళ్లలోనుంచి కన్నీటి బొట్లు కారుతున్నాయి
దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో సైనికులకు ఈ కధ అంకితం ..!
పరేష్ తుర్లపాటి
]]>
https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/%e0%b0%b8%e0%b1%88%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b0%be-%e0%b0%b5%e0%b0%82%e0%b0%a6%e0%b0%a8%e0%b0%82/feed/ 0
ఇది కధ కాదు https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/%e0%b0%87%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%95%e0%b0%a7-%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b1%81/ https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/%e0%b0%87%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%95%e0%b0%a7-%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b1%81/#respond Sat, 31 Jul 2021 10:50:55 +0000 https://tamilpolitrics.com/?p=595
“ప్రయాణీకులకు విజ్ఞప్తి ..మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లవలిసిన బస్సు బయలుదేరుటకు సిద్ధంగా వుంది “..హైదరాబాద్ ఇమ్లిబన్ బస్సు స్టేషన్ లో మైక్ అనౌన్సమెంట్ వినబడగానే వెంకట్ భార్యను ,కూతురిని తీసుకుని గబ గబా బస్సు వున్న ఫ్లాట్ ఫార్మ్ దగ్గరికి వచ్చి ఒకసారి టికెట్ మీద వున్న బస్సు నంబర్ సరి చూసుకుని బస్ ఎక్కాడు ..లోపల అప్పటికే మిగిలిన ప్రయాణీకులు అందరు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు ..డ్రైవర్ కూడా ఇంజిన్ స్టార్ట్ చేసి వీళ్ళ కోసమే ఆగినట్టున్నాడు
వెంకట్ డ్రైవర్ దగ్గరికి ” మా సీట్లు నంబర్లు ఎక్కడ వున్నాయి ” అడిగాడు
డ్రైవర్ టికెట్ మీద వున్న నంబర్లు చెక్ చేసుకుని తనకు ఎడమవైపున వున్న సీట్లు చూపించి “అక్కడ కూర్చోండి సార్ ” అన్నాడు .
వెంకట్ తన లగ్గేజ్ సీటు పైన వున్న రాక్ లో పెట్టి భార్య ,కూతురు తో సహా తమ తమ సీట్లలో కూర్చున్నారు
అప్పుడు వెంకట్ టైము చూసుకున్నాడు ..రాత్రి పది గంటలు కావస్తుంది
డ్రైవర్ను చూస్తే ఇంకా కుర్రాడిలానే వున్నాడు ..ఎలా నడుపుతాడో ఏంటో అనుకుంటూ ..,
“మా కోసమే ఆగినట్టుంది ” అని డ్రైవర్తో మాట కలిపాడు ..స్వతహాగా జర్నలిస్ట్ అయిన వెంకట్
“అవును సార్ “..అని బస్సును బస్సు స్టాండ్ నుంచి బయటకు పొనిస్తున్నాడు డ్రైవర్
“నీ పేరేంటి ” మెల్లగా డ్రైవర్ తో కబుర్లు మొదలు పెట్టాడు వెంకట్
“రామారావు సార్ ” అందరు రాము అని పిలుస్తారు
“అయితే నేను కూడా రాము అనే పిలవ వచ్చా “నవ్వుతూ
రాము సమాధానం చెప్పలేదు ..చిన్నగా నవ్వి ఊరుకున్నాడు
“అవును మనం బెంగుళూరు వెళ్లేసరికి ఎంత టైం అవుతుంది “
ఉదయం తొమ్మిది గంటల వరకు వెళ్ళిపోతాం సార్ “
బస్సు మెల్లిగా హైవే మీద పోతుంది
ఈ లోపు వెంకట్ ఏడేళ్ల కూతురు “డాడీ ..రేపు బెంగుళూరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నాకు దీపావళి చిచ్చుబుడ్లు ..లక్ష్మి ఔట్లు కొనిపెట్టాలి “అడిగింది
వెంకట్ సమాధానం చెప్పేలోగానే రాము “ఆమ్మో లక్ష్మి ఔట్లె ..భయం వేయదా అమ్మా “..బస్సు నడుపుతూనే కలిపించుకుని అడిగాడు
“చుడండి అంకుల్ ..నాకు భయం లేదని చెప్పినా మా డాడీ నాకు లక్ష్మి ఔట్లు మాత్రం కొననంటున్నాడు “గారాబంగా చెప్పింది వెంకట్ కూతురు
ఎందుకో రాము తల తిప్పి ఒక్క క్షణం ఆ అమ్మాయి వైపు చూసి మళ్ళీ డ్రైవింగ్ వైపు ద్రుష్టి పెట్టాడు
“ఎల్లుండి దీపావళి పండగ కదా ..బెంగుళూరులో వున్న మా అత్తగారింటికి వెళ్తున్నాం ..పొద్దుటినుంచి ఇది ఒకటే సతాయిస్తుంది ..ఈ సారి లక్ష్మి ఔట్లు కొనిపెట్టాల్సిందే అని ..నువ్వైనా చెప్పు రాము అవి కాల్చటం డేంజర్ అని “చెప్పాడు వెంకట్ డ్రైవర్ రాము తో
రాము ఏమి మాట్లాడలేదు ..నిశబ్దంగా బస్సును పొనిస్తున్నాడు
అంకుల్ “సైరా ” సినిమా చూసారా ” మళ్ళీ వెంకట్ కూతురే కల్పించుకుని అడిగింది రాముని
ఏదో ఆలోచిస్తున్న రాము తేరుకుని “లేదమ్మా ..మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాక చూడాలి “చెప్పాడు ముభావంగా
ఇదిగో అంకుల్ డ్రైవింగ్ చేస్తున్నారుగా ..అలా విసిగించకు ..పడుకో..పిల్లను కసురుకుంది వెంకట్ భార్య
బస్సులో లైట్లు కూడా ఆపేసి రాము బస్సును హైవే మీద పొనిస్తున్నాడు
అప్పటికే బస్సులో వున్న ప్రయాణీకులు అందరు నిద్రలోకి జారుకున్నారు
వెంకట్ ,భార్య ,కూతురు కూడా నిద్రలోకి జారుకున్నారు
రాము బస్సును ఒక డాబా పక్కన ఆపటంతో వెంకట్ కు మెలుకువ వచ్చింది ..టైం చూసుకుంటే అర్ధరాత్రి రెండు గంటలు అవుతుంది
కిటికీ లోనుంచి చూస్తే రాము డాబా కు ఆనుకుని వున్న చాయ్ బడ్డీ దగ్గర చెంబుతో మొహం కడుక్కుంటూ కనపడ్డాడు ..మొహం కడుక్కుని వేడి వేడిగా చాయ్ తాగాడు ..ఆ టైం లో సెల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు
ఈ లోపు బాత్రూం కి దిగిన ప్రయాణీకులు కూడా బస్సు ఎక్కారు
రాము బస్సు ఎక్కి మళ్ళీ స్టార్ట్ చేసాడు
“నిద్ర వస్తుందా ” నిద్ర మత్తులోనే వెంకట్ రాముని అడిగాడు
“లేదు సార్ ..మాకిలాంటివి అలవాటే “.. చెప్పి మళ్ళీ బస్సుని బెంగుళూరు వైపు పోనిచ్చాడు
మెల్లిగా వెంకట్ నిద్రలోకి జారుకున్నాడు
మధ్య రాత్రిలో సడెన్ గా వెంకట్ కు మెలకువ వచ్చింది
చీకటిలో డ్రైవర్ రాము మొహం సరిగా కనపడటం లేదు ..కానీ బస్సును నిదానంగానే నడుపుతున్నాడు అన్పించింది ..అలా ఆలోచిస్తూనే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు వెంకట్
ఎప్పుడు వచ్చిందో బెంగుళూరు ..బస్ స్టాండ్ లో ఆపి “సార్ ..బెంగుళూరు వచ్చింది “..నిద్రలో వున్న వెంకట్ ను తట్టి చెప్పాడు రాము
కళ్ళు తెరిచి చూసిన వెంకట్ కు ఎర్రబడిన కళ్ళతో డ్రైవర్ రాము కన్పించాడు
..మొహం కూడా చాల పాలిపోయినట్లు అనిపించింది ..ఎందుకో అతని మొహం చూస్తే ఎదో కోల్పోయిన వాడిలా కనిపించాడు
అదే అడుగుదాము అనుకునే లోగా ఎప్పుడు లేచిందో వెంకట్ కూతురు రాము చెయ్యి పట్టుకుని “అంకుల్ ..నాకు లక్ష్మి ఔట్లు కొనిపెట్టమని మా డాడీకి చెప్పారా ?లేదా ?అడిగింది
“లేదమ్మా ..ఇప్పుడే చెప్తాను ..ముందు నువ్వు ఈ చాకోలెట్ తీసుకో ” అంటూ జేబులో వున్నా ఫైవ్ స్టార్ చాకోలెట్ తీసి ఆ పిల్ల చేతిలో పెట్టాడు
నవ్వుకుంటూ వెంకట్ ,భార్య కూతురు తో బస్సు దిగి వెళుతుంటే “సార్ ..ఒక్క మాట “వెనకనుంచి వెంకట్ ను పిలిచాడు రాము
తండ్రిని డ్రైవర్ రాము పిలవటంతో కూతురు మొహం మతాబులా వెలిగిపోయింది ..టపాసుల గురించి చెప్పటానికే అలా పిలిచాడనుకుంది
డ్రైవర్ రాము వెంకట్ ను పక్కకు తీసుకెళ్లి పది నిమిషాల పాటు ఏదో చెప్పాడు
పది నిమిషాలు మాట్లాడిన తర్వాత కొద్దీ దూరంలో తల్లి దగ్గర నిలబడి చూస్తున్న వెంకట్ కూతురి వంక చూసి “బై ” అన్నట్లుగా చెయ్యి ఊపాడు ..రాము
వెంకట్ కూతురు కూడా రాము అంకుల్ డాడీతో మాట్లాడి లక్ష్మి ఔట్లు కొనటానికి ఒప్పించినట్లు వున్నాడు అని “బై అంకుల్ “అని నవ్వుతూ చెయ్యి ఊపింది
ఈ లోపు వెంకట్ మామగారు పంపించిన కారు పికప్ చేసుకోవటానికి వచ్చింది ..
ముగ్గురూ కారులో కూర్చున్నారు
వెంకట్ మాత్రం ఎందుకో ముభావంగా వున్నాడు ..కూతురి చేతిలో వున్న ఫైవ్ స్టార్ చాకోలెట్ వంకే చూస్తుండిపోయాడు
వెంకట్ భార్యకి కూడా భర్త సడెన్ గా అలా ముభావంగా ఎందుకు అయ్యాడో అర్ధం కాలేదు
అదే విషయం అతన్ని అడిగింది
వెంకట్ భారమైన మనస్సుతో భార్యకు చెప్పటం మొదలు పెట్టాడు
ఇందాక రాము బస్ స్టాన్డ్ లో నాతొ ఏమి మాట్లాడంటే … వెంకట్ చెపుతున్నాడు ..వింటుంటే భార్యకు కూడా కళ్ళంబడి నీళ్లు తిరుగుతున్నాయి
“సార్ ..రాత్రి బస్సులో మీరు ఎక్కినప్పటినుంచి మీ అమ్మాయిని చూస్తుంటే నాకు నా కూతురే గుర్తుకు వచ్చింది ..అందుకే రాత్రి టీ కి బస్సు ఆపినప్పుడు మీ అమ్మాయికోసమే ఫైవ్ స్టార్ చాకోలెట్ కొన్నాను సార్ ..నాకు ఎక్కువగా వేరే ఊర్లకు డ్యూటీ పడుతుండటంతో కుటుంబంతో గడిపేదే తక్కువ సార్ ..నా కూతురికి కూడా మీ కూతురి వయసే ఉంటుంది సార్ ..రెండు రోజుల బట్టి ఈ సారి దీపావళి పండుగకు నువ్వు ఇంట్లో ఉండి నాతొ టపాసులు కాలిపించాలి నాన్నా “..అని మారం చేస్తుంది సార్ ..సైరా సినిమాకి తీసుకెళ్లమని వారం రోజుల నుంచి నాతొ పోట్లాడుతుంది సార్ ..అందుకే రాత్రి మీ అమ్మాయి మాటలు వింటుంటే నా కూతురి మాటలే గుర్తుకు వచ్చాయి సార్ ..బస్సు నడుపుతున్నానన్న మాటే కానీ ఏడుస్తూనే వున్నా సార్ ..అందుకే రాత్రి రెండు గంటలకు నా భార్యకు ఫోన్ చేసి ఎల్లుండి దీపావళి పండక్కు కూతురుతో టపాసులు కాలిపిస్తానని ..ఆ సంగతి తెల్లారి కూతురు లేచాక తనకే చెప్పమని కూడా చెప్పాను సార్ ..కుటుంబంతో కలిసి పండగలు చేసుకునేంత టైము ,ఆలోచనలు కూడా మాకు వుండవు సార్ ..అసలు మా బతుకులకు సరైన భరోసా కూడా ఏమి ఉండదు సార్ ..నేను మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరేదాకా నా భార్య గుమ్మంలో నిలబడి నా కోసం చూసే ఎదురు చూపులు నాకు గుర్తే సార్ ..నన్ను చూడగానే నా భార్య ముఖంలో ,కూతురు ముఖంలో కనిపించే వెలుగు కూడా నాకు ఎప్పటికి గుర్తే సార్ ..”
ఇకపోతే మీరు కూర్చున్న సీట్లు ఎంపీకి ,ఎమ్మెల్యే కి రిజర్వ్ చేసిన సీట్లు సార్ ..అంటే వారు కనుక బస్సులో ప్రయాణించే దలిస్తే ఆ సీట్లు వారికి ఉచితంగా కేటాయిస్తారు సార్ ..ఇదే కాకుండా ఇంకా కొన్ని క్యాటగిరీల వాళ్లకు టికెట్లలో రాయితీలు గట్రా ఉంటాయి సార్ ..ఇలా వచ్చి ఆలా వెళ్లిపోయేవాళ్లకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం ..బస్సునే నమ్ముకుని కుటుంబాలకు దూరంగా రేయనక ,పగలనక పనిచేసే మాకు ఎందుకు సరైన భద్రతా కల్పించలేకపోతుంది సార్ ?
సరే ..నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్ని విసిగించినట్లున్నాను సార్.. మీరు రాత్రి నాతో మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్టును అని చెప్పారు కదా సార్ ..అందుకే మీకు ఇదంతా చెప్పాలనిపించింది ..ఇదిగోండి సార్ నా మొబైల్ నంబర్ ..మీకు అభ్యన్తరం లేకపోతె మళ్ళీ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకురండి సార్ ..నా భార్యకు ,కూతురికి పరిచయం చేస్తాను ..ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పాడు రాము
ఇదంతా కూతురు వినకుండా వెంకట్ భార్యకు చెప్పాడు
భారమైన మనసుతో ఇంటికి చేరుకున్నారు వెంకట్ దంపతులు
మర్నాడు పొద్దున్నే గుమ్మంలో పడి వున్న పేపెర్ను యధాలాపంగా చుసిన వెంకట్ ఉలిక్కిపడ్డాడు
పేపర్ మొదటి పేజీలోని పెద్ద పెద్ద అక్షరాలతో “బెంగుళూరు నుంచి హైద్రాబాదు వెళుతున్న బస్సుకు ప్రమాదం ..ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాము దుర్మరణం ..డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణీకులకు తప్పిన ప్రాణ హాని ..తప్ప తాగి నిర్లక్షముగా లారీ నడపటమే కాకుండా బస్సును నేరుగా ఢీకొనటంతోనే ఈ దుర్ఘటన సంభవించిందని ఆ సమయంలో బస్సు డ్రైవర్ రాము సమయస్ఫూర్తిగా వ్యవహరించి బస్సును వంతెన పై నుంచి పడకుండా పక్కకు తిప్పటంతో తమకు పెను ప్రమాదం తప్పిందని పలువురు ప్రయాణీకులు బస్సు డ్రైవర్ రామును కొనియాడారు..ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రైవర్ రాము కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేసారు
చదువుతున్న వెంకట్ కి తరవాత అక్షరాలు కనపడటం లేదు ..కళ్ళంబడి ధారగా కారుతున్న కన్నీటితో
వెంకట్ కి ఆ క్షణంలో గుర్తుకు వచ్చింది రాము కూతురే
ఈ కధ బస్సు కార్మికులకు అంకితం
తుర్లపాటి పరేష్
(మిత్రుడు తుర్లపాటి సురేష్ ఫేస్ బుక్ వాల్ నుండి సేకరించినది)
]]>
https://tamilpolitrics.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/%e0%b0%87%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%95%e0%b0%a7-%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b1%81/feed/ 0
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. పేటీఎం సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి https://tamilpolitrics.com/%e0%b0%86%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d-2/%e0%b0%8f%e0%b0%aa%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b6%e0%b1%81/ https://tamilpolitrics.com/%e0%b0%86%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d-2/%e0%b0%8f%e0%b0%aa%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b6%e0%b1%81/#respond Sun, 25 Jul 2021 06:44:39 +0000 https://tamilpolitrics.com/?p=545 ప్రముఖ పేమెంట్స్ యాప్ Paytmలో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ప్రకటన విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ తాజాగా ప్రముఖ Paytm సంస్థలో ఉద్యోగాల భర్తీకి APSSDC నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కస్టమర్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఇంటర్/డిప్లొమో/ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ తో అనుభం ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులకు బైక్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయస్సు 18 – 35 ఏళ్లు ఉండాలి.

]]>
https://tamilpolitrics.com/%e0%b0%86%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d-2/%e0%b0%8f%e0%b0%aa%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b6%e0%b1%81/feed/ 0
హుజూరాబాద్‌లో ఆటోనగర్..అడిగిన వెంటనే రైట్ రైట్… https://tamilpolitrics.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3/%e0%b0%b9%e0%b1%81%e0%b0%9c%e0%b1%82%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%86%e0%b0%9f%e0%b1%8b%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85/ https://tamilpolitrics.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3/%e0%b0%b9%e0%b1%81%e0%b0%9c%e0%b1%82%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%86%e0%b0%9f%e0%b1%8b%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85/#respond Sun, 25 Jul 2021 06:37:15 +0000 https://tamilpolitrics.com/?p=539 హుజూరాబాద్‌ ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.ప్రజలు అడిగిన వెంటనే అన్ని ఇచ్చేస్తున్నారు.. ఇలా ఆటోనగర్ కోసం మూడు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది.

హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు అడిగిన ప్రతి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం మీనామేషాలు లెక్కపెట్టకుండా ముందుకు వస్తుంది. దీంతో కుల సంఘాల నుండి నామిటేటెడ్ పదవుల వరకు ..ఇక అభివృద్ది పరంగా ఏది అడిగితే దాన్ని వెను వెంటనే వారికి అందజేస్తున్నారు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పథకాలు సైతం ఇప్పుడు హుజూరాబాద్ నుండే ప్రారంభం అవుతున్నాయి.

ముఖ్యంగా వేల కోట్ల రూపాయలను దళిత బంధు పథకం ద్వారా ఆ నియోజకవర్గం ప్రజలకు అందించేందుకు సీఎం కేసిఆర్ రెడీ అయ్యారు. అందుకోసం కార్యచరణ రూపోందుతుండగానే…గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డు సమస్యను కూడా అక్కడి నుండే పరిష్కరించారు. మరోవైపు సామాజిక వర్గాల లభ్ధి కోసం వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు స్థలంతో పాటు, యాబై లక్షల రూపాయలు కూడా కేటాయించారు. ఇందుకు సంబంధించి హామీలు ఇవ్వడమే కాదు మంత్రులు అక్కడే మాకం వేసి వెంటవెంటనే మంజూరు చేస్తున్నారు. రోజుల తేడాలోనే వారికి పత్రాలు, డబ్బులు అందజేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ సిటీ సంటర్ హాళ్లో జరిగిన సమావేశంలో ఆటోనగర్ కోసం భూ మంజూరు పత్రాలను యూనియన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యే కు ఆటోనగర్ కోసం విజ్ణప్తి చేసినా స్పందించలేదన్నారు. ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉండాలని ఆయన కోరారు.

]]>
https://tamilpolitrics.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3/%e0%b0%b9%e0%b1%81%e0%b0%9c%e0%b1%82%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%86%e0%b0%9f%e0%b1%8b%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85/feed/ 0